లక్ష్మీపురం గురుకుల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల అస్వస్థత…

జగిత్యాల,జూలై 17 (మన వార్త ప్రతినిధి సాకేత) జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల లో నిన్న జరిగిన బోనాల సెలబ్రేషన్ కార్యక్రమంలో వండినటు వంటి నాన్-వెజ్ ఆహారంతో ఫుడ్ పాయిజన్ జరిగి అమ్మాయిలు అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. ఐదుగురు పరిస్థితి వాంతులు విరేచనాలతో జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. గురువారం రోజు ఉదయం 3 గంటలకు ఇద్దరూ విద్యార్థినిలు, 11 గంటల … Read more

స్థానిక సంస్థల ఎన్నికల్లో… విజయమే లక్ష్యంగా పనిచేయాలి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాహసోపేత నిర్ణయంకాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇందిరమ్మ ఇండ్ల మంజూరి, రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేస్తాంఅర్హులైన పేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలుగజ్వేల్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్….

గజ్వేల్ జూలై 15 (మన వార్త ప్రతినిధి జీ మురళి)స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర మంత్రి పూర్ణం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన గజ్వేల్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలను వర్తింప చేస్తుండగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న … Read more

లక్ష్యం ఏకాగ్రతతో చదువుకుంటూ లక్ష్యం నెరవేర్చుకోవాలి.అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి….

జూలై 15 (మన వార్త ప్రతినిధి జీ మురళి)జగదేవపూర్ గర్ల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు … Read more

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గాల్లోకి కాల్పులు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 13, మనవార్త. మేడిపల్లి లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు మేడిపల్లిలోని కార్యాలయంపై అటాక్ చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అక్కడ బీభత్సం పరిస్థితి నెలకొంది. కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడి చేసినట్లు తెలుస్తోంది.

పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన మిర్చిబండి సతీష్…..

జూలై 13 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహాయార్థం విరాళం అందజేసిన పల్లవి ఫుడ్ కోర్ట్ అధినేత మిర్చిబండి సతీష్ నాగరాణి దంపతులు వారి కుమారులు రాజా, కళ్యాణ్ ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు రాజు ముదిరాజ్ మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్ లో … Read more

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత…..

హైదరాబాద్ (మన వార్త ప్రతినిధి)జూలై 13 ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు.ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కోట శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942న కృష్ణా … Read more

వేములవాడ రూరల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి పరశురాములు నియామకం…

వేములవాడ జులై 10 ( మన వార్త ప్రతినిధి ) వేములవాడ రూరల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి పరశురాములు ను నియమించడం జరిగింది. వేములవాడ మండల బిజెపి ప్రధానికార్యదర్శిగా నియమించినందుకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కి మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ కి, పెద్దలు రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ కి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమనేని వికాస్ కి, మాజి ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ కి, కృతజ్ఞతలు తెలియజేశారు … Read more

గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు…..

బోయిన్పల్లి మండలం జూలై 10 ( మన వార్త ప్రతినిధి ) గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో శ్రీ శ్రీ గురూజీ డాక్టర్ దేవదాసు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వార్త జిల్లా ఇన్చార్జి దెబ్బటి ప్రవీణ్, స్టార్ త్రినేత్రం జిల్లా ఇన్చార్జి చేకూర్తి నవీన్ పాల్గొని ప్రత్యేక పూజలు … Read more

ఏసీబీకి పట్టుబడ్డ SI వేణుగోపాల్…..

గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. PS లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్లో భాగంగా SI గా ఆయన బాధ్యతలు స్వీకరించారు..!!

ఉద్యోగం రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య….

గంభీరావుపేట. జులై 10 మన వార్త ప్రతినిధి..ఈరోజు అనగా తేదీ 10/07/2025 లోకం శ్రీకాంత్,s /o రాములు age ఏజీ25 yrs, .అను వ్యక్తి హైదరాబాదు నుంచి నిన్న రాత్రి వచ్చి వారి ఊరు నర్మల గ్రామం చివరలో ఉన్న వారి పొలం వద్ద మామిడి చెట్టుకు ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని, జాబ్ గురించి వెతుకుతూ ఉద్యోగం రాక పోయేసరికి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి లోకం … Read more