CEIR టెక్నాలజీతో రికవరీ….

*గజ్వేల్ జూలై 29 (మన వార్త ప్రతినిధి జీ మురళి )గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన (28) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం గజ్వేల్ ఒక ఫంక్షన్ హాల్లో ఈరోజు గజ్వేల్ ఏసిపి నరసింహులు, సంబంధిత బాధితులకు అందజేశారు 28 ఫోన్ల విలువ 3, 30,000/-గజ్వేల్ ఏసిపి నరసింహులు, మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, ఎవ్వరైనా దొంగలించకపోయినా వెంటనే సీఈఐఆర్ (CEIR) (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)లో డాటా నమోదు చేయాలి ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందిఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయం పై వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.సెల్ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడకండి.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా.. ఎక్కడైనా పోగొట్టు. కున్నా.. ఎవరైనా దొంగిలించినా.. ఆ బాధ వర్ణణాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైటను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అదే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్). సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారుసెల్ ఫోన్లు త్వరగా రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు*పడిపోయిన దొంగలించబడిన ఫోన్లు దొరికిన సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేసినారు*పోయిన ఫోన్లు మళ్లీ దొరకదు అనుకున్నాము, కానీ పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లు రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు ఆనందం వ్యక్తం చేసి గజ్వేల్ డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు*ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, డివిజన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Leave a Comment