గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్…

హాసన్ పర్తి జులై 28(మనవార్త ప్రతినిధి):హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కాజిపేట్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజున హాసన్ పర్తి దేవేందర్, సబ్ ఇన్స్పెక్టర్, తనవెంట సిబ్బందిని తీసుకుని హసన్‌ పర్తి మరియు ఎల్లాపూర్ గ్రామాలలో పెట్రోలింగ్ చేయుచుండగా,ఎల్లాపూర్ గ్రామంలో హసన్‌పర్తి రోడ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారిలో ఒక వ్యక్తి అనుమాస్పదంగా రెండు లగేజి బ్యాగులతో వెళ్ళుచూ పోలీసు వారిని చూసి బ్యాగులతో పారిపోయే ప్రయత్నం చేయుచుండగా పట్టుకుని విచారించగా,ఆశిష్ కుమార్ నాయక్ తన వివరములు చెబుతూ అతని తండ్రి మేస్త్రి పని చేయుచుండగా,అతనితో పాటు కూలి పని చేస్తూ,అతను చేసే పని వలన సంపాదన సరిపోక అక్రమంగా నైన డబ్బులు సంపాదించాలని అనుకుని సుమారు 6 సంవత్సరముల క్రితం అతనికి పరిచయస్తుడైన జమీర్ తండ్రి శిబ ఆర్/ఓ చాందిపుట్ అతనితో గంజాయి రవాణా చేయగా ఒరిస్సా లోని బరంపుర జిల్లాలో పోలీసు వారు మమ్ములను పట్టుకుని బరంపుర లోని సర్కిల్ జైలుకు పంపించగా 9 నెలల పాటు జైలులో ఉండి,తరువాత అతనికి పరిచయస్తుడైన ప్రశాంత్ మాలిక్ ఆర్/ఓ మోహన,గండపదర్, గజపతి జిల్లా,ఒడిశా రాష్ట్రంనకు చెందిన అతని వద్ద ఒక కిలో గంజాయి 1500/- రూపాయలకు కొనుగోలు చేసి నాలుగైదు సార్లు మహారాష్ట్ర లోని షోలాపూర్ కు చెందిన మహాదేవ్ కాలే అతనికి 4500/-రూపాయలకు గంజాయి అమ్మి లాభం పొందేవాడని, అదే క్రమంలో తేది 24-07-2025 రోజు ప్రశాంత్ మాలిక్ వద్ద అందాజ 30.290 కిలోల గంజాయి (2 కిలోల బరువు గల బ్రౌన్ టేపుతో సీల్ చేయబడిన 15 ప్యాకెట్లలో) గల గంజాయిని 45000/- రూపాయలకు కొని,వాటిని ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు లగేజి బ్యాగులలో సర్దుకుని,తేది 25-07-2025 రోజున ఇచ్చాపురం రైల్వేస్టేషన్ కు వచ్చి కోణార్క్ రైలులో తేది 26-07-2025 రోజు వరంగల్ రైల్వేస్టేషన్ దగ్గరకు చేరుకుంటుండగా రైల్వేస్టేషన్ లో పోలీసులు రైలును తనిఖి చేయుచున్నారని తెలుసుకుని, వెనుక భోగీలో ఉన్న అతను వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి, పోలీసులకు అనుమానం రాకుండా వరంగల్ చుట్టుప్రక్క ఏరియాలో రెండు రోజుల పాటు ఉండి, 28-07-2025 వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖి చేస్తున్నారని తెలుసుకుని ఉదయం మహారాష్ట్రకు వెళ్ళుటకు రైల్వేస్టేషన్ గురించి అడుగగా, హసన్‌పర్తి దగ్గర రైల్వేస్టేషన్ ఉన్నదని తెలుసుకుని ఆటోలో వెళ్ళుచూ రైల్వే బ్రిడ్జి దగ్గర దిగి రోడ్డు ప్రక్కన నుండి నడుచుకుంటూ వెళ్ళే దారిలో సహాయ మాతా దేవాలయం (చర్చ్) దగ్గర, ఎల్లాపూర్ గ్రామములో పట్టుకోవడం జరిగినది. ఇట్టి స్వాధీనం చేసుకున్న 30.290 కిలోల ఎండు గంజాయి బహిరంగ మార్కెట్టులో ఒక కిలోకు రూ. 50,000/- ల చొప్పున మొత్తం రూ. 15,14,500/-ల విలువ ఉంటుందనీ పోలీసులు తెలిపారు.

Leave a Comment