జిల్లాలో…కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టండిరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్….

గజ్వేల్ జూలై 30 (మన వార్త ప్రతినిధి జీ మురళి)త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. మంగళవారంహైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ముఖ్యంగా పేదల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు వారి దరిచేర్చితేనే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. త్వరలోనే సిద్దిపేట జిల్లాలో పర్యటించి సమస్యలు తెలుసుకోనున్నట్లు ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment