అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు….

గజ్వేల్ జూలై 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)’కేజీబీవీ స్కూల్ జగదేవపూర్” విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం సోషల్ మీడియాను అవసరం ఉన్న వరకు మాత్రమే వాడుకోవాలి ఇష్టపడి చదివి మీరు అనుకున్న గోల్ సాధించాలి ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం ఏర్పరచుకొని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి గంజాయి ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దుఈ సందర్భంగా జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, మాట్లాడుతూ* మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది,మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత.చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ స్రవంతి,మరియు అధ్యాపకులు ఏఎస్ఐ రమణారెడ్డి, గజ్వెల్ షీటీమ్ బృందం మహేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లో మహేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment