మల్కాజ్గిరి జిల్లా జూలై 28 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని :మచ్చ బొల్లారం పరిధిలోని అంజనాపురి కాలనీలో సోమవారం మధ్యరాత్రి గుర్తుతెలియని దుండగులు దారుణంగా దొంగతనానికి పాల్పడ్డారు.తాళం వేసి యజమానులు లేని ఇంట్లోకి తాళం పగులగొట్టి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉంచిన 26 తులాల బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి నగలు, అలాగే ₹20,000 నగదు ఎత్తుకెళ్లారు.ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు అల్వాల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.క్లూస్ టీమ్ మరియు సీనియర్ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి నిందితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ కేసును తిమ్మప్ప, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,అల్వాల్ పీఎస్ పర్యవేక్షిస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల గురించి తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.