అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారంజూలై 29, మన వార్త జిల్లా ప్రతినిధి అంతోనిమల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్, మచ్చబొల్లారం రోడ్ నెంబర్ 10, సాయి రెడ్డి కాలనీలో గత వారం రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రివేళల్లో రోడ్లపై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి.కాలనీలోని మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు.చీకటి కారణంగా దొంగతనాలు, అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉందని నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీధి దీపాలు మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారులు, లైన్ మెన్ లకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.కాలనీ ప్రజలు త్వరితగతిన సమస్యను పరిష్కరించి వీధి దీపాలను సరిచేయాలని జిహెచ్ఎంసి మరియు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.