రాంపల్లి శ్రీ రాజేశ్వర కాలనీలో భారీ అక్రమ నిర్మాణం.

  • గతంలో అధికారులు నిలిపివేసిన పనులను మళ్లీ కొనసాగిస్తున్నారు.
  • అధికారులను మ్యానేజ్ చేశానంటున్న సదరు బిల్డర్.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఏప్రిల్ 20, మనవార్త.

రాంపల్లి శ్రీ రాజేశ్వర కాలనీలో స్ట్రీట్ నంబర్ 5లో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణం. గతంలో అక్రమ నిర్మాణం అంటూ పనులు ఆపిన అధికారులు. ఇంతలో అధికారులను మేనేజ్ చేశాను అంటూ దర్జాగా పనులు కొనసాగిస్తున్న సదరు అక్రమ నిర్మాణదారుడు. సంబంధిత అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మాణం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అనుమతించబడిన నిర్మాణ పరిమితి G+2 మాత్రమే ఉండగా, నిర్మాణదారుడు అదనంగా G+3 నిర్మించారు. దీనివల్ల భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించబడటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
అక్రమ నిర్మాణం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా అగ్ని ప్రమాద నియంత్రణ, పార్కింగ్, మౌలిక వసతులపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణదారుడు ఇచ్చే ముడుపులకు ఆశపడకుండా మున్సిపల్ ఆదాయానికి గండిపడకుండా కాపాడి, చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరి ఆ బిల్డరు మేనేజ్ చేసిన అధికారులు ఎవరో తెలియాల్సి ఉంది.

Leave a Comment