మచ్చబొల్లారం సాయి రెడ్డి కాలనీలో వీధి దీపాల సమస్య పరిష్కారంకార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణ స్పందనకు కాలనీ వాసుల కృతజ్ఞతలు…

మల్కాజ్గిరి జిల్లా జూలై 30 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని :మచ్చబొల్లారం 133వ డివిజన్‌లోని సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10లో వీధి దీపాలు పనిచేయకపోవడంతో స్థానికులు ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాసులు విజ్ఞప్తి చేయగానే, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణమేస్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా కాలనీ వీధులు వెలుగులతో మెరిసిపోతూ, ప్రజలకు భద్రతా భావం కలిగింది.వాసుల కృతజ్ఞతలుసమస్య పరిష్కారంతో సాయి రెడ్డి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.మా సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించి నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని వారు తెలిపారు.కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Comment