.వేములవాడ ఏప్రిల్ 26 (మన వార్త )శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సన్నిధిలో సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వాసవి మాతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆమె చూపిన అహింసా మార్గాన్ని అందరూ అనుసరించాలని సూచించారు. అనంతరం చైర్మన్ రాజుతోపాటు వైస్ చైర్మన్ నరాల శేఖర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పిట్టల మనోహర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల భాను కృష్ణ, జాయింట్ సెక్రెటరీ కనికరపు శ్రీనివాస్, కోశాధికారి జెట్టి శేఖర్, సీనియర్ ఈసీ సభ్యులు కటకం జనార్దన్ ను ఆర్యవైశ్య ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో సత్రం జాయింట్ సెక్రెటరీ కట్కూరి శ్రీనివాస్, సత్రం ఆడిట్ కమిటీ చైర్మన్ చీకోటి శ్రీహరి, సత్రం ఫుడ్ కమిటీ చైర్మన్ బుస దశరథం, సత్రం సేవా కమిటీ చైర్మన్ కటకం జనార్ధన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి వేణు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్మ నటరాజ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త అనిల్, ఆర్యవైశ్య నాయకులు సకినాల అశోక్ ,చికోటి అశోక్, దెబ్బేటి శ్రీనివాస్, కొమ్మ శంకర్ తదితరులు పాల్గొన్నారు.