రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (మన వార్త ) తెలంగాణ ప్రభుత్వం వాసవి మాత జయంతిని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుస దశరథం, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కటకం సత్తయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షుడు సిద్ధశెట్టి వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుమార్, అదనపు కార్యదర్శి కటకం జనార్ధన్, కోశాధికారి చీకటి నాగరాజుతో పాటు సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వాసవి మాత ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారిక పండుగగా గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.“వాసవి మాతాకీ జై” నినాదాలతో మార్మోగిన ఈ వేడుకలు జిల్లా వ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచాయి.