వెంకటాపురం జులై 29 మనవార్త అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన రేగా బక్కయ్య ( 48 ) గత ఎనిమిది రోజుల క్రితం చనిపోవడం జరిగింది.అతనికి భార్య పార్వతి,ఇద్దరు కుమారులు ఉన్నారు.వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామంలో వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని విషయం తెలుసుకొన్నా అదే గ్రామంలోనీ జాతీయ బిసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు,బట్ట నాగేందర్ తమ వంతు సాయం కింద కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు,25 కేజీల రైస్ బ్యాగ్ అందజేసి మానవత్వం చాటుకున్నారు.అనాధలైన కుటుంబానికి దాతలు అండగా నిలవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యూత్ సభ్యులు సోలం సుధాకర్, కొక్కురి రాజు, మంచర్ల నాగరాజు,బట్ట వెంకటేశ్వర్లు,సొలం సతీష్, బంద రాములు,పొనగంటి కృష్ణారావు,గుమ్మేళ్ల పురుషోత్తం.పొనగంటి ప్రసాద్, బట్ట మోహన్ రావు, గుండారపు కృష్ణ, మంచర్ల సాంబం,కుంట సందీప్, కుంట సంపత్,ఎక్కిపోయిన సాయికిరణ్, దర్రాజు కృష్ణమూర్తి,మంచర్ల రమేష్, చీడెం రుషీశ్వరరావు,బండ సాంబం,బంద శ్రీకాంత్, మంచర్ల నరేష్,సోలం లక్ష్మయ్య, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందించారు.