అల్వాల్‌లో పేకాట పై దాడి – ఏడుగురు అరెస్ట్, రూ.2.3 లక్షలు స్వాధీనం….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 14 మన వార్త: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు.దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుండి రూ.2.3 లక్షల నగదు, పేకాట పత్తులు స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో నిందితులు సంగారెడ్డి … Read more

చెట్టుకు ఉరి వేసుకుని యువకుడి సూసైడ్…

చిన్నశంకరంపేట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఇంట్లో నుండి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్లిన వ్యక్తి సోమవారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిన్న శంకరంపేట మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం రెడ్డి ప్రసాద్( 25) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుండి తన బైకుపై వెళ్లి రాతి 9 వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు … Read more

గణితం లెక్చరర్ కోసం విద్యార్థినుల నిరసన….

చేగుంట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఆరు నెలలుగా గణితం లెక్చరర్ రావడం లేదని చేగుంట గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినులు సోమవారం ఉదయం గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూజూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తు పై భయం తో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినిలకు హామీ ఇవ్వడంతో … Read more

గంజాయితో పట్టివేత ముగ్గురు యువకులు అరెస్ట్..సమాచారంతో స్పందించిన పోలీసులు—103 గ్రాముల గంజాయి స్వాధీనం…..

ఇల్లంతకుంట,అక్టోబర్ 11 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.శుక్రవారం సాయంత్రం సమయంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చెరువు కట్ట వద్ద మాటు వేసి,గంజాయి అమ్మకానికి వచ్చిన అనంతగిరి గ్రామానికి చెందిన రెడ్డి రాకేష్ రెడ్డి,ఉప్పల ప్రణీత్ రెడ్డి, మాసం మనీష్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 103 గ్రాముల గంజాయిని పంచుల … Read more

ఎర్రవల్లిలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల నిరసన…

గజ్వేల్ అక్టోబర్ 11 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుచేసి, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో … Read more

అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అరెస్టు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 9 మన వార్త : అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డిను అల్వాల్ పోలీసు అధికారులు ఆమె నివాసం వద్ద నుంచి అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఛార్జీలు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో బస్ భవన్” పిలుపు నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.ప్రజల పై భారంగా మారే ఈ బస్సు ఛార్జీల పెంపును … Read more

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 26, మనవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పలు కీలక హోదాల్లో సేవలందించిన ఆయనను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ బాధ్యతలకు నియమించారు. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన అధికారిని తప్పించి, శివధర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకంతో రాష్ట్రంలో నూతన పోలీసు పరిపాలన విధానం అమలులోకి రానుందని అధికారులు పేర్కొన్నారు.

వేములవాడ పట్టణంలో మహిళలకు కోలల పంపిణీ….

రాజన్న సిరిసిల్ల జిల్లా /వేములవాడ సెప్టెంబర్ 21 ( మన వార్త ప్రతినిధి )వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్ 26వ వార్డులో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కోలల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిళ్ల లక్ష్మీరాజు మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కోలలు అందజేశారు.బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, మహిళల ఆనందోత్సాహాలకు ఇది వేదికవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, నాయకులు అన్నం నరసయ్య, రాజేందర్, వెలిశాల … Read more

చిల్కానగర్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 18, మనవార్త. చిల్కానగర్ బ్రహ్మంగారి గుట్ట మీద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో కుల పెద్దలు, మహిళలు, పిల్లలు ఎంతో హుషారుగా, ఉత్సాహంగా పాల్గొని ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిపారు. విశ్వబ్రాహ్మణులు, మహిళలు అందరూ కలసి విశ్వకర్మ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని చిలకానగర్ వీదుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తూ జై విశ్వకర్మ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోతుకునూరి సీతారాములు చారి,ప్రధాన కార్యదర్శి, అలుగోజు ప్రసాద్ … Read more

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం – భూ సేకరణపై సంప్రదింపులు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, సెప్టెంబర్ 18 మన వార్త : అల్వాల్ పరిధిలోని పారడైజ్ నుండి షామీర్‌పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులలో భాగంగా ప్రభావితమవుతున్న ప్రజల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా భూ సేకరణ ప్రత్యేక శ్రేణి అధికారి & డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం రాబోయే శుక్రవారం (19-09-2025) ఉదయం 12 గంటలకు మేడ్చల్–మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో జరగనుంది.ఈ సమావేశంలో భూ సేకరణ, … Read more