సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా అల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 6 మన వార్త: సైబర్ జాగరూకత దివస్” కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు అల్వాల్ పోలీసులు వివిధ ప్రదేశాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఉదయం వేళల్లో బతుకమ్మ పార్క్ – హై టెన్షన్ రోడ్ వద్ద మోర్నింగ్ వాకర్లకు సైబర్ మోసాల విధానాలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి అనే అంశాలపై పోలీసు సిబ్బంది వివరించారు. తరువాత అభ్యాస్ జూనియర్ కాలేజీ, అల్వాల్లో విద్యార్థులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసి, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా లోనూ మోసగాళ్ల రకాల గురించి విపులంగా చెప్పడంతో పాటు, ఎటువంటి సందేహాలైనా 1930 నంబర్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.కమ్యూనిటీ అవగాహనలో భాగంగా ఏ ఆర్ కె హోమ్స్, మచ్చబొల్లారంలో కూడా అవగాహన సెషన్ నిర్వహించారు. గృహ నివాసులకు సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యం, బ్యాంకింగ్ మోసాల నివారణ, అపరిచిత లింకులు/యాప్‌లు క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు లోతుగా వివరించారు.ఈ కార్యక్రమాలన్నింటిని ఎస్ హెచ్ ఓ , అల్వాల్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షించారు. ప్రజలు సైబర్ మోసాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a Comment