అల్వాల్‌లో యూపీ యువకుడు అదృశ్యం – కుటుంబ సభ్యుల్లో ఆందోళన….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 24 మన వార్త : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్‌కు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ (25) అల్వాల్‌లో అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది.పని నిమిత్తం ఈ నెల 14న విజయవాడ పారిశ్రామిక వాడకు వచ్చిన ఆసిఫ్, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉందని 19వ తేదీన అల్వాల్ రాజీవ్ విహార్ సెక్షన్‌లో ఉన్న బంధువు నిహాల్ ఇంటికి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆసిఫ్ అనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల పాటు వెతికిన తరువాత ఆచూకీ లభించకపోవడంతో నిహాల్ అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదులో ఆసిఫ్ కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదని ఆయన పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఫొటోలో ఉన్న యువకుడి గురించిన సమాచారం ఎవరైనా కలిగి ఉంటే వెంటనే అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని తెలిపారు.

Leave a Comment