బెజ్జంకి,నవంబర్ 23( మన వార్త ప్రతినిధి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలు బెజ్జంకి సత్య అర్జున ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళ శక్తి చీరలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలు తీసుకొని వెళ్తున్న క్రమంలో దాచారం స్టేజి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.స్థానికులు 108 కి సమాచారం అందించి క్షతగాత్రులను కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.