బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

చేవెళ్ల నియోజకవర్గం నవంబర్ 21 :మన వార్త ప్రతినిధి

చేవెళ్ల పరిధిలోని మొయినాబాద్ ప్రాంతంలో తాజ్ హోటల్ సమీపంలోని బీజాపూర్ హైవేపై ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందాడు.మరో వ్యక్తి చికిత్స పొద్దుతూ మరణించినట్లు సమాచారం. గాయపడిన ఇతరులను స్థానికులు వెంటనే మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుత వారికి చికిత్స అందిస్తున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment