ఇల్లంతకుంట,నవంబర్ 23 (మన వార్త ప్రతినిధి)రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం గ్రామ మహిళ సంఘం సభ్యులు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ మాజీ సర్పంచ్,మండల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,మాజీ ఎంపీటీసీ,జిల్లా మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు తీగల పుష్పలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.ఇందిర మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తోందని,మహిళలకు ఆత్మగౌరవం పెరుగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం,కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు లింగం,సీనియర్ నాయకులు వొల్లాల వెంకటేశం,అంజయ్య,గ్రామ మహిళ మండలి అధ్యక్షురాలు తీగల రత్నవ,గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి,గ్రామ మహిళ మండలి వివోఏలు వొల్లాల స్వప్న,కదం జయ,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.