పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2009-2010 వ బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరునొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితి గతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,పాఠశాల కు దూరమై 14 సంవత్సరాలు గడవడంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని, విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని తెలిపారు. అనంతరం కేకు కట్ చేసి స్విట్లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థిని విద్యార్థులు పూడూరి రాజు,గంగుల ప్రశాంత్,కొమ్ముశేఖర్, చిగుర్ల రాకేష్, నరేష్ , రాజశేఖర్, పండగ రాజు, ప్రశాంత్ అరుణ్,శేఖర్, నాగలక్ష్మి, స్రవంతి, వనజ,శిరీష ఆమనీ,విజయలక్ష్మి,లావణ్య గంగ భవాని, శృతి,లావణ్య,శిరీష పాల్గొన్నారు.

Leave a Comment