యూరియా కోసం తూప్రాన్ లో రోడ్డెక్కిన రైతులు..ఉత్తి మాటలైన మంత్రి ఆదేశాలు….

తూప్రాన్ సెప్టెంబర్ 9 (మన వార్తా ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద యూరియా పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది.రైతు వేదికల వద్ద టోకెన్లు ఇవ్వమని రైతులు నేరుగా ఫర్టిలైజర్ షాపులలో యూరియా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తిన రైతులు మంగళవారం తూప్రాన్ లో రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం … Read more

తూప్రాన్ లో యూరియా కోసం రైతుల పడి గాపులు…..

తూప్రాన్ ఆగస్టు 8 (మన వార్తా ప్రతినిధి)యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. తూప్రాన్ లోని ఫర్టిలైజర్ షాపుల ముందు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్లతో ఉదయం నుండే బారులు తీరారు. సరిపడా యూరియా రాకపోవడంతో టోకెన్లు పొందిన రైతులకు సైతం యూరియా దొరకకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే సరైన దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వరి పంటపై ఆశలు … Read more

రికార్డు ధర పలికిన దత్తత్రేయ దేవాలయం వినాయకుడి లడ్డు.

మొయినాబాద్ సెప్టెంబర్ 06:మన వార్త ప్రతినిధి. మొయినాబాద్ మండలం లోని కనకమామిడి దత్తత్రేయ దేవాలయం వినాయక లడ్డు ఏకంగా 5 లక్షలు పలికింది. కనకమామిడి కి చెందిన ఎన్ ఎన్ సీ బ్రదర్స్ వేలంపాటలో లడ్డుని దక్కించుకున్నారు. వారు మాట్లాడుతూ గననాధుని నమ్ముకుంటే కచ్చితంగా మంచి జరుగుతుంది అన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు కనకమామిడి ప్రజలపై ఎల్లపుడు ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

కాకతీయ కాలనీ ఫేస్ 2 లో ఘనంగా గణపయ్య నిమజ్జనం వేడుకలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్7, మనవార్త. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రెండవ డివిజన్లోని చెంగిచెర్ల కాకతీయ కాలనీ ఫేస్ టు లో ఆఖరి రోజు గణేష్ నిమజ్జనం వేడుకలు మహిళల కోలాటాలతో, పిల్లల నృత్యాలతో ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు. ముందుగా డిజె సౌండ్ లతో, ఎంతో ఆసక్తిగా పిల్లలు మహిళలు అందరూ, ఆటపాటలతో, ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని, తర్వాత చిన్న లడ్డు లక్కీ డ్రా తీసి లక్కీ డ్రా లో గెలుపొందిన … Read more

ఇల్లంతకుంట 132 కె.వి.సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతులు,రేపు విద్యుత్తు అంతరాయం..సెస్ ఏఈ నగేష్…

ఇల్లంతకుంట ఆగస్టు 31 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ లో టీజీ-ట్రాన్స్కో వారి అంతర్గత పనులు,మరియు అత్యవసర మరమ్మత్తులు ఉన్నందున రేపు సోమవారం (తేదీ :01-09-2025) మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉన్నదని సెస్ ఏఈ నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఏఈ తెలిపిన వివరాల ప్రకారం ఇల్లంతకుంట 132 కె. వి. సబ్ స్టేషన్ పరిధిలోని … Read more

మండలంలో ఎటు చూసినా సమస్యలే…బీఆర్ఎస్ నాయకుడు మల్యాల రాజశేఖర్ ఆవేదన…

ఇల్లంతకుంట,ఆగస్టు 30 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజలు రహదారులా గురించి,రైతన్నలు యూరియా కొరత గురించి,అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అనంతారం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్యాల రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలోని రహదారి..సమస్యలు తీవ్రంగా ఉన్నాయని,పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు,పలు గ్రామాల ప్రజలు మండలానికి వెళ్లడానికి ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులేమో పంటలు పండించినా,అత్యవసరమైన దశలో యూరియా అందక ముప్పు తిప్పలు పడుతున్నారని … Read more

రిజర్వేషన్లు 50శాతం దాటోద్దంటే,2019 లో EWS వర్గాలకు10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేంద్రమే కదా! బీసీలకు ఒక న్యాయం! EWS వర్గాల కొక న్యాయమా! ఇదెక్కడి ప్రజాస్వామ్య తీర్పు!పొలాస నరేందర్ జిల్లా అధ్యక్షులు బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి కరీంనగర్…

ఉత్తర తెలంగాణ శాస్త్రీయంగా,చట్టబద్ధంగా పలుమార్లు రిజర్వేషన్లను ఇస్తామన్న సిఎం,పార్టీ పర ఆలోచన వద్దంటే వద్దు!ఎన్నికల జాప్యం అయిన సరే!చట్టబద్ద రిజర్వేషన్లుకావాలి90 రోజులకు మించి ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండద్దన్న సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా,కోర్టు ధిక్కరణ క్రింద సుప్రీంకోర్టు కెళ్ళుటకు జాప్యం వద్దు!30న కేబినెట్లో,జరుగనున్న అసెంబ్లీలో కోర్టు ధిక్కరణ క్రింద సుప్రీం కోర్టుకు వెళ్ళేలా నిర్ణయించండి!జాప్యంతో బీసీల ఆగ్రహం పార్టీల మనుగడకు ప్రశ్నార్థకం!రిజర్వేషన్లకు అడ్డుపడుతూ,ఎన్నికల జాప్యానికి,గ్రామాల అభివృద్ధి కుంటు పడుటకు కారకులైన పార్టీలకు,నేతలకు బీసీ వర్గాలు బుద్ధి … Read more

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి…-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్…

(జమ్మికుంట,మనవార్త) భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.ఈ మేరకు గురువారం ఉదయం 2 పట్టణాల కమిషనర్లు,వివిధ మండలాల అధికారులతో ఫోన్ లో సంభాషించారు.వీలైనంత వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని,కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ, … Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు….

ఇల్లంతకుంట, ఆగస్టు 28 (మనవార్త ప్రతినిధి):జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు.

ఇల్లంతకుంటలో కుండపోత వర్షం – గాలిపల్లి ఎస్సీ కాలనీ జలమయం…ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు…

ఇల్లంతకుంట, ఆగస్టు 27 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ముఖ్యంగా గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునిగిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎస్.ఏ.ఫారూఖ్,ఎంపీడీవో శ్రీనివాస్,సీఐ మొగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ మరియు ఇతర శాఖల అధికారులు బుధవారం రాత్రి సమయంలో వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.నీటిమునిగిన ప్రాంతాల్లోని కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తూ రెవెన్యూ, పోలీస్,గ్రామ పంచాయతీ సిబ్బంది హై … Read more