గణితం లెక్చరర్ కోసం విద్యార్థినుల నిరసన….

చేగుంట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఆరు నెలలుగా గణితం లెక్చరర్ రావడం లేదని చేగుంట గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినులు సోమవారం ఉదయం గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూజూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తు పై భయం తో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినిలకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Leave a Comment