ఎల్కతుర్తి వైన్‌షాప్‌లో దొంగతనం ఎల్కతుర్తి….

అక్టోబర్16 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న వినాయక వైన్ షాప్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి మద్యం బాటిల్స్‌తో పాటు కౌంటర్‌లో ఉన్న నగదు మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే దుకాణంలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సులను కూడా దొంగలు తమతో తీసుకెళ్లినట్లు సమాచారం.దొంగలు షాప్ వెనుకవైపు గోడ దాటి లోపలికి ప్రవేశించి, బాటిల్స్, క్యాష్, సీసీటీవీ రికార్డింగ్ పరికరాలు తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సిబ్బంది ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.స్థలానికి పోలీసులు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించారు. వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Comment