ఇల్లంతకుంట,అక్టోబర్ 11 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.శుక్రవారం సాయంత్రం సమయంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చెరువు కట్ట వద్ద మాటు వేసి,గంజాయి అమ్మకానికి వచ్చిన అనంతగిరి గ్రామానికి చెందిన రెడ్డి రాకేష్ రెడ్డి,ఉప్పల ప్రణీత్ రెడ్డి, మాసం మనీష్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 103 గ్రాముల గంజాయిని పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం రెండవ ఎస్సై జి.లక్పతి కేసు నమోదు చేయగా,సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తదుపరి విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ,గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయానికి లేదా వాడకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.