ఎర్రవల్లిలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల నిరసన…

గజ్వేల్ అక్టోబర్ 11 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుచేసి, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో బాలచంద్రం, కనకయ్య, సత్యం, శ్రీశైలం, మంకేష్ స్వామి చాకలి సత్యం, బాబు, వెంకట్, మొండి స్వామి, మహేష్, నరేందర్, భాస్కర్, నరసింహారెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు

Leave a Comment