కార్పొరేటర్ ఇంట్లో పేకాట….

హనుమకొండ అక్టోబర్ 14(మనవార్త ప్రతినిధి):హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట ఆడుతున్నా సమాచారంతో తనిఖీ చేసినట్టు పోలీసులు తెలిపారు.. 12 మంది పట్టుబడినట్టు, వారి నుండి 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు..

Leave a Comment