వానరమా దారివ్వు —గజ్వేల్ లో కోతుల స్వైరవిహారం….

అక్టోబర్ 21 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కోతుల బెడద ఎక్కువై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, గజ్వేల్ బస్టాండ్ ఎదురుగా కావేరి హోటల్ గల్లీలో రోడ్డుకు అడ్డంగా కూర్చొని కోతులు ఆ దారి గుండా వెళ్లే వారిని ఇబ్బంది పెట్టాయి, గుంపులు గుంపులుగా చేరి, రోడ్లమీద, గల్లీలలో, స్వైర విహారం చేస్తూ, చిన్నారులను మహిళలను వృద్ధులను, బయట తిరగడానికి, ఇబ్బందికి గురి చేస్తున్నాయి, ఒక్కోసారి ఇంట్లోకి ప్రవేశించి, బీభత్సం సృష్టిస్తున్నాయి, ఇంటి డాబాలపై ఆరబెట్టిన ఆహార పదార్థాలను చిందరవందర చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి, గతంలో కోతుల బెడద వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వివిధ ప్రాంతాల్లో చూసామని వెంటనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో కోతుల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు

Leave a Comment