మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 9 మన వార్త : అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డిను అల్వాల్ పోలీసు అధికారులు ఆమె నివాసం వద్ద నుంచి అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఛార్జీలు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో బస్ భవన్” పిలుపు నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.ప్రజల పై భారంగా మారే ఈ బస్సు ఛార్జీల పెంపును మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించము. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు.