అల్వాల్‌లో పేకాట పై దాడి – ఏడుగురు అరెస్ట్, రూ.2.3 లక్షలు స్వాధీనం….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 14 మన వార్త: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే అల్వాల్‌ లోని పంచశీల కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు.దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుండి రూ.2.3 లక్షల నగదు, పేకాట పత్తులు స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో నిందితులు సంగారెడ్డి జిల్లా గాజులరామారం, బౌరంపేట ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దాడి నిర్వహించిన అల్వాల్ ఎస్ఓటి పోలీసులు పంచశీల కాలనీ, అల్వాల్ స్వాధీనం చేసిన నగదు 2.3 లక్షలు నిందితులు సంగారెడ్డి గాజులరామారం, బౌరంపేట ప్రాంతాలకు చెందిన 7 మంది ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Comment