చిన్నశంకరంపేట అక్టోబర్ 12( మన వార్త ప్రతినిధి)ఇంట్లో నుండి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్లిన వ్యక్తి సోమవారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిన్న శంకరంపేట మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం రెడ్డి ప్రసాద్( 25) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుండి తన బైకుపై వెళ్లి రాతి 9 వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు వెతికారు. సోమవారం గ్రామంలోని చెత్త బండి చెత్తను పారబోయడానికి రిక్కల గుట్ట వద్దకు వెళ్లగా, అక్కడ బైకు కనబడింది. ఇట్టి విషయం గ్రామస్తులకు చెత్త బండి డ్రైవర్ సమాచారం అందించడంతో కుటుంబీకులు రెక్కల గుట్ట ప్రాంతంలో వెతుకుతుండగా, పొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకొని విగతాజీవిగా కనిపించాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.