రోడ్డు మరమ్మత్తులు చేపించండి సారు…ప్రజల ఆవేదన..**మండలాధికారులు,గ్రామ అధికారులు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి..
*ఇల్లంతకుంట,సెప్టెంబర్ 12 (మన వార్తా ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుండి రహీంఖాన్‌పేటకు వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అడుగు అడుగున గుంతలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.గుంతల మయం కావడంతో ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనంతారం గ్రామస్థులు మాట్లాడుతూ—“మేము సిరిసిల్లకు వెళ్లాలంటే ఇల్లంతకుంట మీదుగా తిరగాల్సి వస్తోంది.రహీంఖాన్‌పేట–అనంతారం మీదుగా నడిచే బస్సులు కూడా ఇప్పుడు అనంతారం వరకు రావడం లేదు.డిపో అధికారులను అడిగితే..రోడ్డు బాగాలేదని … Read more