చెంగిచెర్లలో జులై 27న ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారీ, జూన్ 25, మనవార్త. తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన గ్రామదేవతల పండుగిది.రాష్ట్ర పండుగ బోనాల జాతరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్ల ముస్తాబవుతోంది. జులై 27న ఆదివారం బోనాల వేడుకలు జరుపుకొనుటకు గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్ కొత్త చెందర్ గౌడ్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్, బోడుప్పల్ కార్పొరేషన్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్,మాజీ … Read more

ఇందిరానగర్ లో అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులు.

తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 25, మనవార్త. బంజారా హిల్స్ పరిధిలోని ఇందిరానగర్ లో అక్రమ నిర్మాణాలు అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలపై చర్యలు … Read more

సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయం….

తూప్రాన్ జూన్ 24 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం కిష్టాపూర్ హల్ది వాగులో ఈనెల 20న పోలీస్, రెవిన్యూ, విద్యుత్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి అక్రమ విద్యుత్ పరికరాలతో పాటు అక్రమంగా డంపు చేసిన ఇసుక కుప్పలను సీజ్ చేశారు. ఇసుక కుప్పలను సోమవారం వేలం వేస్తామని అదే రోజు తహసిల్దార్ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు మెదక్ కలెక్టర్ పేరిట డీడీలు తీసి తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని … Read more

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎనిమిది మంది వ్యక్తులు….

హనుమకొండ జూన్ 22(మనవార్త ప్రతినిధి):హనుమకొండ లో విశ్వసనీయ సమాచారంతో మచిలీ బజార్ ఏరియాలో ఒక ఇంటి ఆవరణలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకున్నట్టు హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. వారి దగ్గర నుండి ఏడు సెల్ ఫోన్లు 13,020 రూపాయలను మరియు మరియు పేకముక్కలని స్వాధీన పరచుకోవడం జరిగింది తర్వాత సిఐ మాట్లాడుతూ చాలామంది ప్రజలు ఇట్టి జూదానికి మద్యానికి బానిసై అప్పుల పాలై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు వీరిని పట్టుకున్న … Read more

మేడిపల్లి మండల ప్రింట్ మీడియా నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 22, మనవార్త. మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాను సుందర్, కోశాధికారిగా మరాఠి మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగుదాం జర్నలిజం విలువలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల ప్రింట్ మీడియా … Read more

నిలువుదోపిడి చేస్తున్న మరో కార్పొరేట్ భూతం శ్రీ చైతన్య…..

నారాయణ – నేడు శ్రీ చైతన్య బాగోతం బయటపెట్టిన బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు.- జీవోలన్నీ నీళ్లపాలు..వనపర్తి జిల్లాలో.- ఫీజులు పుస్తకాల పేరిట పాఠశాలలు నిలువుదోపిడి.- పాఠశాల సమీపంలో… డబుల్ బెడ్రూం ఇళ్లలో పుస్తకాల అమ్మకాలు.- మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు. – ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న వనపర్తి ఎంఈవో.- మున్సిపల్ అధికారులను పిలిపించి పుస్తకాల గదికి తాళం వేయించిన వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్.- విద్యాశాఖ అధికారుల … Read more

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి…

బూర్గంపాడు/ మనవార్త: బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో అవినీతిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ అయిన సిహెచ్. నవక్రాంత్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.బాధితుల సమాచారం మేరకు, రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి రూ. 4,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారుల తక్షణ స్పందనతో పక్కా వ్యూహం ప్రకారం తనిఖీ చేపట్టారు. నవక్రాంత్ … Read more

చికిత్స పొందుతూ యువకుడు మృతి తూప్రాన్….

జూన్ 20 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చేగుంట మండలం చందాయి పేటకు చెందిన భీమరబోయిన మహేష్ (28) కుటుంబం కొన్నేళ్లుగా తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ లో నివాసం ఉంటున్నారు. నెలరోజుల క్రితం బైక్ పై వస్తూ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేష్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

మల్కాజ్గిరి వాసులకు శుభవార్త ఏఓసీ సెంటర్ నుంచి విముక్తి దిశగా అడుగులు నూతన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం – రక్షణ శాఖ అనుమతి..

మల్కాజ్గిరి జిల్లా జూన్ 20 వార్త జిల్లా ప్రతినిధి అంతోని : మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మర్రి రాజశేఖర్ రెడ్డి శుభవార్త చెప్పారు. మల్కాజ్గిరిలోని ఏఓసీ సెంటర్, చక్రబంధం ప్రాంతాల నుంచి విముక్తి దిశగా నిర్ణయాత్మక అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలైన ఆర్కేపురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసీ సెంటర్లలో అదనపు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని, అదే విధంగా రక్షణ శాఖకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని … Read more

వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 21, మనవార్త. చర్లపల్లి డివిజన్ పరిధిలోని మోడీ విస్టా లో ప్రధాన సమస్య వాటర్ బిల్ అధికంగా వస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వాటర్ బిల్ అధికంగా వస్తుందని దానికి తోడు ఇంట్రెస్ట్ కూడా వేయడంతో Rs 7,45,240 /- రూపాయలు వచ్చింది అని తెలియజేయగా వెంటనే స్పందించిన … Read more