- మామూళ్ల మత్తులో డిఐఈఓ గోపాల్.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, మార్చి 10, మనవార్త.
హనుమకొండలో అనుమతి లేని ప్రతిభ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవడానికి మౌనం వహిస్తున్న డిఐఈఓ గోపాల్. ప్రతిభ జూనియర్ కళాశాల యాజమాన్యం డిఐఈఓ గోపాల్ కి భారీగానే ముడుపులు ముట్ట చెప్పిందని పలువురు విమర్శిస్తున్నారు. అందుకే ప్రతిభ కళాశాలపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం అధికారులకు ముడుపులు అందించి అంతకుమించి ఫీజుల భారం అంతా మాపై మోపి తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇకనుంచి అనుమతి లేని ప్రతిభా కాలేజీలో మా పిల్లల్ని చదివించబోమని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాధ్యత కలిగిన డిఐఈఓ గోపాల్ తన బాధ్యతలను మరిచి యాజమాన్యం ఇచ్చే ముడుపుల కాశపడి, కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.