గజ్వేల్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి జీ మురళి )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శుక్రవారం గ్రామస్థులు బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తీసుకువస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా ఆగిపోయి భగీరథ నీరు రావడంలేదని, త్రాగునీటికి ఇంటి అవసరాలకు నీటికి విపరీతమైన ఇబ్బంది నెలకొందని వ్యవసాయ పంట పొలాల వద్ద బోరు బావుల వద్దకు వెళ్లడం జరుగుతుందని, ఇంట్లో వృద్ధులకు చిన్న పిల్లలకు నీటి కోసం గోస ఏర్పడిందని వెంటనే అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించి నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు,