హనుమకొండ జూన్ 27(మనవార్త ప్రతినిధి):గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ ఆవరణ లో అదుపులోకి తీసుకొవడం జరిగింది.గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే అతను అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతున్నాడు అదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీస్ వారు పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఇతని పట్టుకున్న ఏఎస్ఐ రఘునారెడ్డి కానిస్టేబుల్ కరుణాకర్ ని సిఐ అభినందించారు