.రాయపోల్ ఫిబ్రవరి 13 (మన వార్త):గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీ వర్గాలకు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు.మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చైర్మన్ కాగా ఓసీలకు వైస్ చైర్మన్ పదవి దక్కిందని, రెండోసారి ఓసీలు చైర్మన్‌గా, మైనార్టీలకు వైస్ చైర్మన్‌గా అవకాశం లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం బీసీ మహిళ చైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఈసారి ఎస్సీలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం సముచితమని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు మున్సిపాలిటీ వచ్చినప్పటికీ దళితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.ఈసారి గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీలకు తగిన స్థానం కల్పించి సామాజిక న్యాయం చేయాలని కోరారు.ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్పందించి గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని నీరుడి స్వామి విజ్ఞప్తి చేశారు.