ముగ్గురు మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్….

తూప్రాన్ జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయ గౌడ్) సిద్దిపేట, మెదక్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ మేనేజర్లకు డిప్యూటేషన్ కల్పిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టికే శ్రీదేవి ఆదేశాల జారీ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో పని చేస్తున్న మేనేజర్ రఘువరన్ ను రామాయంపేట మున్సిపాలిటీకి, సిద్దిపేట రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్ తూప్రాన్ మున్సిపాలిటీకి, రామాయంపేట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసులు సిద్దిపేట మున్సిపాలిటీకి డిప్యూటేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్ టికే శ్రీదేవి ఆదేశించారు.

Leave a Comment