- అనుమతులు లేని అదనపు అంతస్తుల అక్రమ నిర్మాణాలు.
- మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు.
తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 26, మనవార్త.
ఎల్బీనగర్ సర్కిల్ బి.ఎన్.రెడ్డి నగర్ పరిధిలోని చైతన్య నగర్ లో అక్రమ నిర్మాణాలు అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారు ఈ అక్రమ నిర్మాణాల పై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మామూళ్ల మత్తుకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ అక్రమ నిర్మాణం వద్ద నుండి పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని అందుకే వారు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు బాధ్యతగా ఉన్నట్టయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేయాలే తప్ప ఇలా అక్రమ సంపాదనకు పాల్పడడం హేయమైన చర్య అని ప్రజలు ఛీ కొడుతున్నారు. ప్రజలు కట్టిన పన్నులను లక్షల్లో వేతనాలుగా తీసుకుంటూ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయాలే తప్ప వ్యక్తిగత ఆదాయం కోసం పనిచేయడం ఎంతవరకు సబబు అని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు నిజంగా బాధ్యత కలిగిన అధికారులే అయితే తమపై ఉన్న మచ్చను తొలగించుకొని వెంటనే ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.