6 గురి పేకాట రాయుళ్ల అరెస్టు నగదు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన – సిఐ రంగాకృష్ణ

జూన్ 27 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని జైన్ వెంచర్లో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 10, 700 నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంగకృష్ణ తెలిపారు. ఈ దాడిలో తూప్రాన్ ఎస్ఐ 2 యాదగిరి, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment