ఎవరికి నయా పైసా ఇవ్వలేదు– పదేండ్లు డబుల్ బెడ్ రూమ్ కోసం ఎదురుచూసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు కాలే*– ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రెస్ మీట్…

శంకరపట్నం:జూన్ 26(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో మా ఆశలు నెరవేరాయని 27 గ్రామాలకు చెందిన లబ్ధిదారులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 27 గ్రామాలకు చెందిన కొంతమంది లబ్ధిదారులు కేశవపట్నం చేరుకున్నారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను వేడుకుంటే ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని ముక్తకంఠంతో లబ్ధిదారులు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,సబ్సిడీ గ్యాస్,సన్న బియ్యం, ఇప్పుడు మాలాంటి పూరీ గుడిసెల్లో నివసిస్తున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నయా పైసా ఇవ్వలేదని స్పష్టం చేశారు.పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రసమయి బాలకిషన్ ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారో చెప్పాలని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పదేళ్లు ఒక్క ఇల్లు మంజూరు చేయని రసమయి బాలకిషన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment