ట్రంక్ లైన్ పనులను పర్యవేక్షించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 29, మనవార్త.

మన్సూరాబాద్ డివిజన్ లోని దాదాపు 20 కాలనీలకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారంగా సి ఎస్ ఆర్ కాలనీ నుండి మొదలయ్యి ప్రస్తుతం స్వాతి రెసిడెన్సిలో జరుగుతున్న ట్రంక్ లైన్ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బీ అధికారులతో, వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పనులను పరిశీలించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రెండు వారాల క్రితం పనులు మధ్యలో ఆపడంతో జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పనులు ప్రారంభించాలని జిఎం కి తెలియజేసి కొంత దూరం వరకు ఒక కాంట్రాక్టర్ మరికొంత దూరం వరకు ఇంకో కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పి తగినంత నిధులను మంజూరు చేయాలని తొందరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాన్ని ఇచ్చి మళ్లీ పనులను ప్రారంభించే పూర్తిచేసే దిశగా ముందుకు తీసుకెళుతున్నందుకు కార్పొరేటర్ ఎండి అశోక్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
డ్రైనేజ్ ట్రంక్ లైన్ పనులు మొదలైనప్పటి నుండి ప్రతిసారి మధ్యలో ఆగిపోతున్న పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మళ్లీ పనులను ప్రారంభించే దిశగా నా వంతు బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ కాలనీవాసులు రామారావు, ప్రమోద్ రెడ్డి,సత్యం, సోమనాథ్,నవీన్ రావు, శ్రీనివాస రెడ్డి, మహేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు నక్క రాజేష్ గౌడ్, వెంకట్ రమణ గౌడ్,ప్రవీణ్ గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి,కడారి యాదగిరి యాదవ్,రమేష్ చారి,గుండు యాదగిరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment