జాలిగామ గ్రామంలో పోలీస్ కవాతు గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని – ఎసిపి నర్సింలు…

గజ్వేల్ నవంబర్ 30 మన వార్త ప్రతినిధిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో గజ్వేల్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గజ్వేల్ ఏసిపి నర్సింలు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలలో గట్టి నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు … Read more

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటిపైగా ఆస్తినష్టం…

మల్యాల, నవంబర్ 30 (మన వార్త ప్రతినిధి)జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిలోని కొండగట్టు దిగువన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాంతంలో శనివారంరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సుమారు 30కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా, మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దుకాణాల నుంచి జనాలు బయటకు పరుగులు పెట్టారు. దీంతో బొమ్మలు అమ్ముకుని జీవనం సాగించే కొన్ని కుటుంబాలకు కట్టుబట్టలే మిగిలాయి. దుకాణ సామాగ్రితోపాటు, నగదు, ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. కాగా, అగ్నిప్రమాద … Read more

కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ నియామకంపై అన్యాయం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, నవంబర్ 26, మనవార్త. కురుమ(బీసీ)కుల సంఘాల హక్కులపై ప్రశ్నలు లేచేవిధంగా, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ నియామకమైన దిశగా ఉందని అసమర్థవంతమైన, ప్రశ్నార్థక విధానం”పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది ప్రసన్న కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటన ప్రకారం, ట్రస్టీ బోర్డు సభ్యులతో కానీ అందుబాటులో ఉన్న ఇతర వర్గాలకు (ప్రత్యేకంగా కురుమ సంఘాలకు) అవకాశాలు లేకపోవడంతో ఇది అన్యాయమైన నియామకం అని ఆయన అపహాస్యంగా అన్నారు. దేవునికి … Read more

ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు మృతి * మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్….

ఎల్కతుర్తి నవంబర్ 24 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం (దగ్గువారిపల్లి) గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పూజారిగా భక్తి పూర్వకంగా సేవలందిస్తున్న సిద్ధాంతి సంతోష్ (43) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10:40 నిమిషాలకు మృతి చెందిన విషయం తెలిసిందే రెండు రోజులుగా అస్వాస్తతతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మొదట గ్రామంలోని స్థానిక వైద్యులను సంప్రదించారు అయితే పరిస్థితి క్షీణించడంతో వెంటనే అనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ … Read more

రిజర్వేషన్లు మార్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్థాం… గ్రామ ప్రజల తీర్మానం….

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఇష్టం వచ్చినట్లు సవరించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు సోమవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వార్డుల్లో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలించి అవక తవకలు జరిగాయని గతంలో వచ్చిన రిజర్వేషన్లకు ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని గతంలో ఒకటో వార్డు నుండి ఐదవ వార్డ్ వరకు బీసీ … Read more

అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టిన కారు ఇద్దరు యువకులకి స్వల్ప గాయాలు….

బెజ్జంకి,నవంబర్ 25 (మన వార్త రిపోర్టర్) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లా లాపూర్ స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి కరీంనగర్ వెళ్తున్న కారు అదుపు తప్పి గాగిల్లపూర్ స్టేజ్ వద్ద స్టేజ్ డివైడర్ ని ఢీ కొట్టింది.కారులో ఉన్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అతివేగం ప్రమాదానికి కారణమని తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకడంపు సీజ్ చేసిన అధికారులు..

. నిజాంపేట నవంబర్ 24( మన వార్త ప్రతినిధి ) నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలోని గొల్ల బిక్షపతి పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఉన్న అక్రమ ఇసుక డంపును స్థానిక తహశీల్దార్ తో పాటు ఎస్ఐ రాజేష్ సిజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డా నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరు కూడా అక్రమంగా ఇసుక నిలువ ఉంచితే … Read more

సొసైటీ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు…

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండలంలోని చందంపేట సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం తో పాటు రైతుల డబ్బులను సీఈవో పాషాకాజేసిన విషయంపై సోమవారం డిసిఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధికారి తుకారం విచారణ చేపట్టగా రైతుల నుండి సహకార సంఘం సీఈవో పై ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి, రైతుల ఖాతాల నుండి నేరుగా డబ్బులు డ్రా చేయడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వచ్చే … Read more

వెంకట్రావుపల్లిలో బీసీలు లేమా అంటున్న గ్రామస్తులు…**-443 బీసీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డు కేటాయించకపోవడంతో వెంకట్రావుపల్లె గ్రామంలో ఆందోళన…

ఇల్లంతకుంట,నవంబర్ 24 (మన వార్త ప్రతినిధి)ఇల్లంతకుంట మండలంలో సోమవారం సర్పంచ్-వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును గెజిట్ ముద్రతో ప్రభుత్వం విడుదల చేసిన లిస్టు చూసి,మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అనగోని యాదగిరి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ “మా గ్రామంలో 443 మంది బీసీలు,138 మంది ఎస్సీలు,34 ఓసీలు,5 ఎస్టీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డూ కేటాయించలేదు.ఏ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ లిస్టు రూపొందించబడింది..?”అని అధికారులు తెలియజేయాలని కోరారు.“మా హక్కులను … Read more

అల్వాల్‌లో యూపీ యువకుడు అదృశ్యం – కుటుంబ సభ్యుల్లో ఆందోళన….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 24 మన వార్త : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్‌కు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ (25) అల్వాల్‌లో అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది.పని నిమిత్తం ఈ నెల 14న విజయవాడ పారిశ్రామిక వాడకు వచ్చిన ఆసిఫ్, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉందని 19వ తేదీన అల్వాల్ రాజీవ్ విహార్ సెక్షన్‌లో ఉన్న బంధువు నిహాల్ ఇంటికి వచ్చాడు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆసిఫ్ అనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. రెండు … Read more