*బెజ్జంకి,డిసెంబర్ 2 (మన వార్త):కరీంనగర్ జిల్లాలో మండలం ఇందిరానగర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొని,ఎదురుగా వస్తున్న బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది.కారులో ప్రయాణిస్తున్న ఆర్‌ఐ సంతోష్,టైపిస్టు సంతోష్,జూనియర్ అసిస్టెంట్ శేఖర్,బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ గాయాలపాలయ్యారు.స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా,గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.