రేపు శ్రీ దత్త పౌర్ణమి 12వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయండి. గురూజీ డాక్టర్ శ్రీ దేవదాస్ స్వామి….

బోయినపల్లి మండలం డిసెంబర్ 03 ( మన వార్త ప్రతినిధి ) రేపు గురువారం శ్రీ దత్త పౌర్ణమి 12 వార్షికోత్సవ వేడుకలు బోయినపల్లి మండలం స్తంభంపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గురూజీ డాక్టర్ శ్రీశ్రీశ్రీ దేవదాసు స్వామి తెలిపారు ఇట్టి వార్షికోత్సవ వేడుకలకు పీఠాధిపతులు వస్తున్నారని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మరియు పల్లకి సేవ హోమం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని దేవదాసు స్వామి తెలియజేశారు.కావున భక్తులు అందరూ ఈ వార్షికోత్సవ వేడుకల లో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని స్తంభంపల్లి శ్రీ సాయిబాబా దేవాలయ కమిటీ తెలియజేశారు.

Leave a Comment