శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు ఎన్నికల కోడ్ అమలులో ఉంది – ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ గూమి కూడ రాదు బెజ్జంకి ఎస్సై సౌజన్య…

బెజ్జంకి,డిసెంబర్ 12(మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు( రెండవ దశ) నేపథ్యంలో శాంతి భద్రతల నడుమ జరిగేందుకు గాను సెక్షన్ 163,BNSS, 2023 అమలు చేయడం జరిగింది.తేదీ 12-12-2025 శుక్రవారం సాయంత్రం 5గంటల నుండి తేదీ 15-12-2025 ఉదయం ఏడు గంటల వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమీకూడడం,ఊరేగింపులు, నిషేధమని ఈ యొక్క ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంగించే వారు ఎవరైన చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చెసి శిక్షార్హులుగా పరిగణించడం జరుగుతుందనీ తెలిపారు.

Leave a Comment