ఎన్నికల శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..ఎస్సై సిరిసిల్ల అశోక్…*సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సి ఆర్ పి సి) విధింపు….అల్లర్లు చేస్తే లక్ష జరిమానా – ఆరు నెలల జైలు…

ఇల్లంతకుంట డిసెంబర్ 12 (మన వార్త ప్రతినిధి);స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతి–భద్రతలకు భంగం కలిగించే చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు రెండవ విడతల తేదీ ఈనెల 14- 12- 2025 ( ఆదివారం) రోజున నిర్వహించబడుతున్నది.కావున దానికోసం ప్రచారాలు ఈరోజు అనగా తేదీ:12-12 – 2025 ( శుక్రవారం) సాయంత్రం 05.00 గంటలకు ముగుస్తున్నవి.సాయంత్రం 05.00 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారాలు చేయరాదు,ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినచో వారిపైన ఎన్నికల నిబంధన ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.పోటీలో ఉన్న అభ్యర్థులు,వారి అనుచరులు, మద్దతుదారులు ఎవరైనా ఓటర్లను డబ్బులు,మద్యం,బహుమతులు,వివిధ రూపేనా ప్రలోభ పెట్టడం కాని భయపెట్టడం కాని చేసిన వారిపైన ఎలక్షన్ నిబంధన ప్రకారం మరియు బిఎన్ఎస్ మరియు వివిధ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొనబడతాయి.అలాగే ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్ చుట్టూ 100 మీటర్ల లోపు మరియు 200 మీటర్ల లోపు మార్కింగ్ చేయడం జరుగుతుంది,ఎవరైనా సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ ( 144 సి ఆర్ పి సి) సెక్షన్ ను ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకొనబడతాయి అని అన్నారు.ఎలక్షన్లు సజావుగా జరగడం కోసం రౌడీ షీటర్ లను మరియు గ్రామాలలో ఇబ్బందులను సృష్టించే వ్యక్తులను బెల్ట్ షాప్ యజమానులను బైండోవర్ చేయడం జరిగింది.బైండోవర్ అయిన వ్యక్తులు ఎవరైనాఅలజడులు,గొడవలు,గలాటలు సృష్టించిన వారి పైన కేసులు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి సుమారు 200 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది,కావున మండల ప్రజలందరూ ఎన్నికలు శాంతియుతంగా సాగేతందుకు ఎన్నికల అధికారులకు,పోలీస్ అధికారులకి సహకరించాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలియజేశారు.

Leave a Comment