చెక్‌పోస్ట్ వద్ద బారికేడు ఢీకొట్టి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..నిందితులను పట్టుకున్న బెజ్జంకి ఎస్సై సౌజన్య…

.బెజ్జంకి,డిసెంబర్ 4 (మన వార్త ప్రతినిధి);బెజ్జంకి మండలం దేవక్కపల్లి స్టేజ్ ఎలక్షన్ చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉన్న ఎస్‌ఎస్‌టి సిబ్బందిని బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడు‌ను ఢీకొట్టడంతో,విధి నిర్వహణలో ఉన్న రాజగోపాలపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సిద్ధి రాములు పొట్ట భాగంలో తీవ్రంగా గాయపడ్డారు.ఘటన అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయారు.తదుపరి,బెజ్జంకి మండలం స్థానిక ఎస్సై బి.సౌజన్య వెంటనే స్పందించి పారిపోయిన నిందితులను ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు.విచారణ చేయగా నిందితుల వివరాలు 1.ఇజ్జగిరి ఆదిత్య (29),2.సాతినేని అమృత్ కోటి (25)అని గుర్తించగా,వీరు ఇద్దరూ కరీంనగర్ వాసులని తెలిసింది.వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బెజ్జంకి ఎస్సై బి.సౌజన్య తెలిపారు.

Leave a Comment