బెజ్జంకి, డిసెంబర్ 12( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో రెండవ విడత స్థానిక ఎన్నికలలో భాగంగా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన బెజ్జంకి, గుండారం, బేగంపేట, వడ్లుర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం హుస్నాబాద్ ఆర్టిఓ రామ్మూర్తి, బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు.ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి,ఎన్నికల సిబ్బందికి కావలసిన మౌలిక వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకొనీ ఎన్నికల అధికారులకు,సిబ్బందికి తగు సూచనలు చేశారు.