మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజన – 9 నుంచి 16కు విస్తరణ….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, డిసెంబర్ 10 మన వార్త : పట్టణ అభివృద్ధి, జనాభా పెరుగుదల, ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిపాలన విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఇప్పటి వరకు 9 డివిజన్‌లుగా ఉన్న మల్కాజిగిరి ప్రాంతాన్ని ఇప్పుడు 16 డివిజన్‌లుగా విస్తరించారు. కొత్తగా ప్రకటించిన డివిజన్‌ల జాబితాను జిహెచ్ఎంసి అధికారులు విడుదల చేశారు.క్రొత్త డివిజన్‌ల వారీగా సంఖ్యలు – పేర్లు1. ఈస్ట్ ఆనంద్ బాగ్ – 1802. మీర్జాలగూడ – 1813. గౌతమ్ నగర్ – 1824. మల్కాజిగిరి – 1835. బలరాంనగర్ – 1846. సఫిల్ గూడా – 1857. మౌలాలి – 1868. వినాయక్ నగర్ – 1879. నేరేడ్మెట్ – 18810. యాప్రాల్ – 18911. తుర్కపల్లి – 19012. మచ్చ బొల్లారం – 19113. టెంపుల్ అల్వాల్ – 19214. వెంకటాపురం – 19315. భూదేవి నగర్ – 19416. కానాజీగూడ – 195సర్కిల్ వారీ విభజనమల్కాజిగిరి సర్కిల్ – 10 డివిజన్‌లు,అల్వాల్ సర్కిల్ – 6 డివిజన్‌లు ప్రజా సేవలు విస్తరణకు పునర్విభజన ఈ కొత్త విభజనతో స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, పారిశుధ్య సేవలు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలు వేగవంతం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. అధిక జనాభా కారణంగా ముందున్న డివిజన్ల పరిపాలనా భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.మల్కాజిగిరి అల్వాల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పునర్విభజన సహాయకారి కానుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment