మోగిన తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా….

.హైదరాబాద్, జనవరి 27(మనవార్త)తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు.ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి … Read more

పదవి ముగిసే సరికైన పేరు నమోదు అయ్యేనా….?

చందుర్తి, జనవరి 26, మన వార్త.చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామానికి చెందిన సర్పంచ్ వేడుకకి పిలవగా అక్కడికి వెళ్లి గ్రామపంచాయతిలో అనుక్రమ పట్టిక బోర్డులో నూతనంగా సర్పంచ్ అయినటువంటి పులి సత్యం పేరు లేకపోవడంతో పట్టిక బోర్డును చూసిన పలువురు అసహనం వ్యక్తం చేశారు.ఇది చూస్తే గ్రామ పంచాయతీ సెక్రటరీ పనితనం కళ్లకు కట్టినట్టు ఉట్టిపడుతుంది..

అల్వాల్ సిటిజన్ కాలనీలో హాస్టల్‌లో అగ్నిప్రమాదం.ఏసీలు బ్లాస్ట్…ఊపిరాడక ఆరుగురు విద్యార్థులు అస్వస్థత నాలుగు,అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్‌తో సహాయక చర్యలు….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, జనవరి 25 మన వార్త :అల్వాల్ పరిధిలోని సిటిజన్ కాలనీలో ఉన్న నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్ నాలుగో అంతస్తులో అమర్చిన ఎయిర్ కండీషనర్లు అకస్మాత్తుగా బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగి, క్రమంగా ఐదవ అంతస్తుకు వ్యాపించాయి.ఈ ఘటన సమయంలో ఐదవ అంతస్తులోని ఒక గదిలో సుమారు 20 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మంటల నుంచి వచ్చిన దట్టమైన … Read more

నేతకానీ కుల సంఘం సమావేశంనేతకానీ నామినేటెడ్ సభ్యులను,ప్రజాప్రతినిధులను సన్మానించిన కుల సంఘం నాయకులు….

ములుగు జనవరి 25 మనవార్త రాష్ట్రంలో ముఖ్య నేతకానీ కుల సంఘం నాయకులు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామం సమ్మక్క,సారాలమ్మ ప్రాంగణంలో నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు,బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన జనగాం గంగలక్ష్మి ని,మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహా స్వామి దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన చప్పిడి ఎంకటేశ్వర్లను, ములుగు జిల్లా ఎస్సి, ఎస్టీ మనిటరింగ్ సభ్యలు సనారకని రాంబాబు ను, స్థానిక సంస్థల ఎన్నికలలో … Read more

సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ….

బెజ్జంకి, జనవరి 24( మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీ జాతర కమిటీ చేర్మెన్ తాజా మాజి సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు,జాతర కమిటీ … Read more

కొండగట్టులో అర్చకుల ధర్నా…

.జగిత్యాల, జనవరి 23(మనవార్త)జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. తమ పట్ల ఆలయ ఈవో శ్రీకాంత రావు ప్రదర్శించిన వైఖరిపై తీవ్ర ఆవేదన చెంది, విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించేందుకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికొచ్చారు. ఈ విషయమ్మీద అంతకుముందే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, … Read more

మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు…

హైదరాబాద్,జనవరి24(మనవార్త)మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్​ ఉండదని అధికారులు తెలిపారు.ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల-సికింద్రాబాద్​ మధ్య మరో 3, సికింద్రాబాద్​- సిర్పూర్​కాగజ్​నగర్‌కు 2, సిర్పూర్​ కాగజ్‌ నగర్​- సికింద్రాబాద్‌కు 2, నిజామాబాద్-వరంగల్​మధ్య 4, వరంగల్-నిజామాబాద్​ మధ్య 4, కాజీపేట-ఖమ్మం … Read more

శుద్ధ జల కేంద్రం(వాటర్ ప్లాంట్) మరమ్మత్తులు చెపట్టండి….

చందుర్తి, జనవరి 20, మన వార్త.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామం లో దాదాపు 1000 మంది ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం(వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.కిష్టంపేట గ్రామ మసీద్ ముందర ఉన్న శుద్ధ జల కేంద్రం మరమ్మత్తులు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయకపోవడం వల్ల గ్రామస్తులు, అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ మొకానపెల్లి దేవరాజు ప్రత్యేక చొరవ తీసుకోని నూతన శుద్ధ జలకేంద్రం … Read more

గ్రామాభివృద్ధికి నిధులు మంజూరి చేయించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేసినగుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య….

బెజ్జంకి,జనవరి 16( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం గుగ్గిళ్ల గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ను,కరీంనగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో అసంపూర్తిగా … Read more

బిజెపి అభ్యర్థులను గెలిపించండి మున్సిపల్ ని అభివృద్ధి పరచుకుందాం… బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్….

రామయంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి) మెదక్ అసెంబ్లీ రామాయంపేట పట్టణంలోని బిజెపి కార్యాలయం లో రామాయంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ హాజరయ్యారు . మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, రామయంపేట డివిజన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని. … Read more