చందుర్తి, మార్చి 26, (మన వార్త.)
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం రామాలయంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరిగే శ్రీరామ నవమి వేడుకలు చాలా ఘనంగా, అధ్యాత్మిక వైభవంగా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలనుండి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయని జోగాపూర్ గ్రామస్తులు, చెప్తున్నారు. రానున్న వేడుకల కోసం గ్రామ సర్పంచ్ తో పాటు పాలకవర్గం దృష్టి పెట్టారు. శ్రీ సీత రాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు అవసరం ఉందని ఆలయ అర్చకులు తెలియజేయగా, వాటిని రామారావు పల్లి గ్రామానికి చెందిన బోజరాజు పద్మ తమ కుట్టు మిషన్ సహాయంతో శ్రీ రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామి వార్లకు పట్టు వస్త్రాలు కుట్టి సిద్ధం చేసానని తెలిపారు. పద్మ గత 8 సంవత్సరాల నుండి సనుగుల శ్రీ గోవింద రాజుల స్వామి వార్లకు జోగాపూర్ రామాలయం దేవత మూర్థులకు పట్టు వస్త్రాలు అందజేస్తానని తెలిపారు .